ప్రేమలో పడ్డ వారు ఓ ఊహాలోకంలో తేలిపోతుంటారు. ఆ ప్రేమకు కారణాలు ఏవైనా కావచ్చు. ఒకరిపై ఒకరు లేనిపోని అవాస్తవికమైన అంచనాలు పెట్టుకుంటారు. ఎదుటి వ్యక్తి కోసం ఏదైనా చేయటానికి సిద్దపడతారు. ప్రేమలో లాజిక్కుల కంటే మనసు చేసే మ్యాజిక్కులకే ప్రాముఖ్యత ఎక్కువ. అవాస్తవికమైన అంచనాలు తలకిందులు అయినపుడు ప్రేమ బంధం నాశనం అవుతుంది. అందుకే ప్రేమ వ్యవహారంలో వాస్తవిక అంచనాలు ఎంతో ముఖ్యం. తీసుకునే నిర్ణయాలు మనసుతో మాత్రమే కాదు బుద్ధితో కూడా అయిఉండాలి. అప్పుడే ఎదుటి వ్యక్తితో బంధం సాఫీగా సాగుతుంది.
మనసుతో కాదు బుద్దితో ఆలోచించాలి..
మనం ప్రేమించినంత మాత్రాన ఎదుటి వ్యక్తి మనల్ని అర్థం చేసుకునేవారై ఉంటారని.. కలకాలం మనతో ఉండాలని లేదు. ప్రేమ అనేది భావోద్వేగాలతో కూడుకున్నది.. ఎదుటి వ్యక్తి మనకు సరైనవారా.. కాదా అన్న ఆలోచన తార్కికమైనది. మనం ఎవరితోనైనా ప్రేమలో పడే అవకాశం ఉంది. మనల్ని ద్వేషించే వారితో.. మనల్ని గురించి ఆలోచించని, గౌరవించని వారితో.. తమ జీవితాల్ని నాశనం చేసుకుంటూ మనల్ని కూడా నాశనం చేసే వ్యక్తుల్తో ఇలా ఎవరితోనైనా మనం ప్రేమలో పడొచ్చు. ఇది సమస్య కాదు.. వారితో జీవితాన్ని పంచుకోవాలనుకున్నప్పుడే అది సమస్యగా మారుతుంది. మన జీవితంలో అడుగుపెట్టబోయే భాగస్వామిని ఎంపిక చేసుకునే సమయంలో మనసుకంటే బుద్ధికి ఎక్కువ ప్రాధన్యాత ఇవ్వాలి. వారి గురించి అన్ని రకాలుగా ఆలోచించుకున్నాకే ముందడుగు వేయాలి.
ప్రేమ మాత్రమే సరిపోదు..
ఓ ఇద్దరు వ్యక్తులు ప్రేమలో పడి బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత సమస్యలు రావచ్చు. అలాంటప్పుడు కేవలం ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఆ సమస్యలకు పరిష్కారాన్ని చూపదు. గొడవలు ఎక్కువయ్యే కొద్దీ ఇద్దరి మధ్యా దూరం పెరుగుతూ పోతుంది. ఒకనొక దశలో ఈ గొడవలు బ్రేకప్‌కు దారి తీయోచ్చు. ఇంటికి పునాది ఎంత ముఖ్యమో ప్రేమకు కూడా ఓ బలమైన పునాది అవసరం. అది వాస్తవికమైన అంచనాలతో నిర్మితమై ఉంటే మరీ మంచిది. గొడవలు పడ్డా ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ప్రేమ మొదలైన కొత్తలో ఉన్న ఎమోషన్ చివర్లో ఉండదు. ప్రాక్టికాలిటీ చాలా అవసరం.
మన త్యాగాలకు అర్థం ఉందా?..
ప్రేమతో ఓ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత మనం మన గురించే కాకుండా ఎదుటి వ్యక్తి గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. వారి అవసరాలు కూడా తీర్చాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో కొన్ని కొన్ని త్యాగాలు చేయకతప్పదు. కొన్ని విషయాల్లో ఎదుటి వ్యక్తి కోసం మన కోర్కెలను, సమయాన్ని చంపుకోక తప్పదు. ప్రేమ అన్నాక ఇవన్నీ చేయకతప్పదు. కానీ, ఎదుటి వ్యక్తితో కలిసి ఉండటం కోసం మనం మన సెల్ఫ్ రెస్పెక్ట్‌ను, డిగ్నీటీని, ఆశయాలను చంపుకోవటం ఎంత వరకు సమంజసం. మనం ఏ ప్రేమ కోసమైతే ఇవన్నీ చేస్తున్నామో అలాంటి ప్రేమే సమస్యగా తయారైతే?.. ప్రేమ బంధం అనేది మన వ్యక్తిగత గుర్తింపును పాడు చేసేది, భర్తీ చేసేదిగా కాకుండా కాపాడేదిగా ఉండాలి. ప్రేమలో త్యాగాలకు కూడా హద్దు ఉంటుందని తెలుసుకోవాలి.