• We kindly request chatzozo forum members to follow forum rules to avoid getting a temporary suspension. Do not use non-English languages in the International Sex Chat Discussion section. This section is mainly created for everyone who uses English as their communication language.

కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు. త్వరలోనే కూలిపోతుంది

Deepak Kiran

Paw Patrol of ZoZo
Posting Freak
కుటుంబ వ్యవస్థ ఇక నిలువబడదు. త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి...

*అందుకు గల కారణాలు*

1. అతి తెలివి, గర్వము, డబ్బులు ఉన్నాయనే అహంకారం.

2. చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం. ఓర్పు లేకపోవడం.

3. పిల్లలు, పెద్దలు కూర్చొని మనస్పూర్తిగా మాట్లాడుకోలేకపోవడం .

4. ఎక్కువ సమయం TV, ఫోన్లు, ఇతర net program లలో మునిగిపోవడం. (ఎక్కడో ఉన్న సినిమా హీరో, హీరోయిన్లు ఏం తిన్నారో, ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ, ఇంట్లో అమ్మ నాన్న ఏం తిన్నారో వాళ్ళు ఏమి చేస్తున్నారో తెలియదు)

5. చిన్న విషయాలకు అలిగి, స్వంత వారితో కూడా దూరంగా ఉండటం.

6. ఎవరో ఒకరి నోటి దురుసుతనం, కోపం వల్ల కుటుంబం అంతా చెదిరిపోవడం.

7. ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దల సలహా తీసుకోకపోవడం

8. భార్యాభర్తలు, తలితండ్రులు తరుచు గొడవలు పడుతుండడంతో పిల్లలు పెళ్లి అంటే భయం కలుగుతుంది. పెళ్లి వద్దనుకునే స్థితికి వచ్చేశారు...

9. మనిషికి మరో మనిషంటే గిట్టనితనం... పెత్తనం కోసం పోరాటం. ఒంటరితనం ఇష్టపడుతున్నారు.

10. మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు. ఎవరిష్టానికి వారన్నారు. మంచి చెప్పినా నచ్చటం లేదు.

11. కుటుంబ నిర్వహణ ఆనేది గొప్ప కళ. అది తెలియక పోవడం మరో కారణం.

12. మానవ సంబంధాలు, సున్నితత్వం మరచిపోయి, మొరటు వ్యవహారం వచ్చేసింది. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు. "నేను", "నేనే", " నేను చెపితే చేయాలి" అనే ధోరణి ప్రబలిపోయింది.

13. social media లో జరిగిందే నిజం, ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.

14. ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన message పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు... ఇండ్లకు వెళ్లి పలకరించడం లేదు. మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేదు.

15. ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు, నిర్లిప్తంగా ఉండిపోతున్నారు... ప్రక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళుతున్నారు తప్ప, ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి.

ఇదే పరిస్థితి కొనసాగితే, అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు, అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనడం అతిశయోక్తి కాదేమో.
 
Top