hyd-soul-rider
Newbie
ఒక రోజు బ్రహ్మ ఒక అద్భుతాన్ని తయారు చేద్దాం అనుకున్నాడేమో,అనుకున్నదే తడవుగా ఎలా ఉండలో రాయడం మొదలుపెట్టాడు, గరళకంఠుని కంఠములోని గరళము వలే చిక్కటి చీకటిని తలపించే కురులు,ఆ గరళము కించిత్ శ్వాసించిన మానవ,దానవ,సురులు అందరు అస్వస్తులు అయ్యారంట,కానీ సుగంధములతో అలలు వలే ఎగసిపడే నీ వెంట్రుకలను చూసినంతనే అందరు మయమరచి గతితప్పుతున్నారు,ఆకాశం లాంటి నుదురు,దానిపై జారువాలే ముంగురులు, ఆకాశము లో పక్షుల లా అల్లరి చేస్తుంటే, ప్రొద్దుతిరుగుడు పువ్వు అంటి కనులు, కాటుక దిద్ది,విశాలమైన నీ కనులు మనసులోని భావాలను పలికిస్తుంటే,ఆ సూర్యుడే సృష్టి ధర్మానికి విరుద్ధం గా,ప్రొద్దుతిరుగుడు పువ్వు లాంటి నీ కనులను అనుసరిస్తూ తిరుగుతాడేమో,వేణువులాంటి నాసికము,అది చేసే ఉత్స్వాస,నిశ్వాసలు, వేణువు వేసిన తాళము లా ధ్వనిస్తుంటే,నా గుండె చప్పుడు ను నిర్బందించ తరమా, సురులు అసురులు పల సముద్రమును మధించినప్పుడు వచ్చిన ధన, కనక, స్థిర చరములను పంచుకున్నారు,కానీ ఆ మధనం లో పుట్టిన నవనీతాన్ని మరిచారేమో,ఆ నవనితమే నీ చెక్కిలి గా మారిఉండాలి, వసంతానా చిరు రేణువులు రాలుతున్నపుడు , నిండు కుండగా మారిన తేనే తొట్టి నుండి తేనే పొంగి పారుతూ ఉంటుంది,అలానే నీ పెదవులు తేనెలు పండిస్తున్నట్టు ఉన్నది, అందుకనే కాబోలు నీ కబురులు అంట మధురం గా ఉంటాయి, శిశిర ఋతువున ప్రకృతి పడే కోణంగి రాగాలకు మయూరము తనచెవులను రిక్కించి వింటుంటి,ఆలా నేను చెప్పే ఊసులు పదిలంగా దాచుకోవడానికి ఆరాటపడే నెలపొడుపు చంద్రవంక వంటి నీ చెవులు,,,,
ఆ ఫై రాద్దాము అంటే, ఆలోచనలు సరిపొవట్లే, ఎదో తెలియని వెలితి కనిపిస్తుంది రాస్తున్న ప్రతి అక్షరం లోను ,అందుకే,గత రెండు రోజులుగా పరిపూర్ణం చేద్దాం అంటే కుదరక ఆగా, కానీ సరిపడా భావం దొరకట్లేదు, ఇప్పటికి ఇది మాత్రమే, భవిష్యత్తులో పరిపూర్ణం చేద్దాం అని ఆశిస్తున్నా,,,,
ఆ ఫై రాద్దాము అంటే, ఆలోచనలు సరిపొవట్లే, ఎదో తెలియని వెలితి కనిపిస్తుంది రాస్తున్న ప్రతి అక్షరం లోను ,అందుకే,గత రెండు రోజులుగా పరిపూర్ణం చేద్దాం అంటే కుదరక ఆగా, కానీ సరిపడా భావం దొరకట్లేదు, ఇప్పటికి ఇది మాత్రమే, భవిష్యత్తులో పరిపూర్ణం చేద్దాం అని ఆశిస్తున్నా,,,,