(( Late post.... ))
Happy birthday సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు... ( 20-5-1955)
మీరు లేకపోయినా...
మీ సాహిత్యం అజరామరం ....
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం ....
ఆయన చేసిన కృష్ణామృతార్చన ఎంతో మధురం...
ఆ కృష్ణ తత్వాన్ని మనసార అనుభవించి రాసినట్టుగా సమకూర్చారు ఈ పలుకులు....
ఇలా రాయడం శాస్త్రి గారికే చెల్లింది ఏమో....
ఔరా అమ్మకచెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాథల్లో ఆనందలాలా....
భావం : ఓ... అమ్మ + అక్క + చెల్లి .... అసలు ఇది నమ్మేది ఎలా... ఆ నందుడి వారసునీ ( కృష్ణుడి) లీలలు.... భలే విచిత్రం అయినవి.....
బాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీలా
భావం : అయ్య బాబోయ్.... నిజమే....ఆ నందనందనుడి లీలలు వర్ణించడం ఆ బ్రహ్మ దేవుడికే సాధ్యం అవుతుంది.... రేపల్లె వాడల్లో ఆ కృష్ణుడి లీలలు....
ఐనవాడే అందరికీ.. ఐనా అందడు ఎవ్వరికి
భావం : అతను అందరికీ కావలిసిన వాడే.... అయినా కూడా అతని లీలలు ...ఆలోచనలు ఎవ్వరికీ అర్థం కావు....
బాలుడా?.. గోపాలుడా? ... లోకాల పాలుడా?
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!
భావం : అసలు ఆ కన్నయ్య చిన్నపిల్లాడా ? గోవులు కాచే వాడా? లోకాన్ని పరిపాలించేవాడా? ఎలా తెలిసేది అసలు????
నల్లరాతి కండలతో.... కరుకైనవాడే అనందలాలా!!!
భావం : రాతి లాంటి దృఢమైన కండలు ఉన్నవాడు ఈ నల్లని కన్నయ్య....
వెన్నముద్ద గుండెలతో...కరుణించు తోడే ఆనందలీల!!
భావం : వెన్నె లాంటి మృదువైన హృదయంతో అందరికీ తోడుగా అంటాడు ఈ కృష్ణయ్య....
ఆయుధాలు పట్టను అంటూ.. బావ బండి తోలిపెట్టే ఆ నందలాల
భావం : కురుక్షేత్ర యుద్ధం లో ఆయుధం పట్టను అని .... కేవలం తన బావ అయిన అర్జునుడి రథ సారథిగా ఉండి భగవద్గీత బోధించిన వాడు ఈ నందనందనుడు ( కృష్ణుడు)
జాణ జానపదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీల..
భావం : గోపికలతో రాసలీలామృతమైనా .... లేదా గీతలో జ్ఞానామృతమైనా.... అది కృష్ణుడికే చెల్లింది....
ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆ నందలాల...
భావం : ఆవుల మందకి కాపరిలా కనిపించేది ఈ కృష్ణుడే....
ఆలమందు కాళుడిలా అనుపించుకాదా ఆనందలీల...
భావం : యుద్ధం చేసే అప్పుడు యముడిలా అనిపించేది కూడా ఈ కృష్ణయ్య లీలే....
వేలితో కొండను ఎత్తే.. కొండంత వేలుపటే ఆ నందలాల...
భావం : చిటికెన వేలితో కొండను ఎత్తి.... నేను ఉన్నాను అంటూ కొండంత ధైర్యం ఇచ్చేది ఈయనే....
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల...
భావం : సత్యభామ గర్వం అణిచి .... ఎంత విలువైన బంగారం కూడా తనకి సమానం కాదు అని... రుక్మిణి భక్తితో తెచ్చిన ఒక తులసి ఆకు కి తూగిపోయి ... ఆయన మహత్యాన్ని చాటుకున్నాడు.....