Risikumar Reddy
Epic Legend
అమ్మకు రెండవ పదం లేదు. రెండవ వ్యక్తి లేదు. ఆమ్మ గురించి మన మనసు ఎప్పుడూ నిండు చెరువు. మరి అమ్మ మనసు ? మనమే సర్వస్వం. అటువంటి అమ్మను విదేశాలు వెళ్తూ వృద్ధశరణాలయానికి పంపడం బాధాకరం. చిన్నప్పుడు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నది తనను వదిలించుకుంటావని కాదు. చేతి కర్ర లేకపోయినా చేయిపట్టి నడిపిస్తావనే. అంతేకానీ అందరూ ఉండి ఒంటరి చేస్తావని మాత్రం కాదు. ఏది ఏమైనా ఎవ్వరి పరిస్థితి ఎలాటిందో తెలియదు. కానీ విధి విచిత్రం ఏమంటే ఎంత కష్టం వచ్చినా పిల్లల్ని కన్నవాళ్లు వదులుకోరు. కానీ కన్నపిల్లలు మాత్రం వదులుకోగలుగుతారు. ఏమో.... ఆ ఆమ్మను తీసుకువెళ్ళడానికి పరిస్థితులు అనుకూలంగా లేవేమో. ఓదార్పు కోసం లేవనే అనుకుందాం.