LoverBoyyy
Newbie
అమ్మ ఉంటె చాలు జన్మంతా మేలు..
అమ్మ ఉంటె చాలు అనురాగపు సంకెళ్లు...
కష్టాలకు చిట్కాలు, కన్నీళ్లకు వీడ్కోలు ..
ఆప్యాయత గుళికలు, నును వెచ్చని కవ్వింతలు..
ఓర్పుకు పుట్టిల్లు, ఓదార్పుకు పొదరిల్లు...
అమ్మ ప్రేమగా ఈ సృష్టి మొదలు,అమ్మ తోనే ఈ జగతి కదులు ..
అమ్మ ఉంటె చాలు జన్మంతా మేలు
భవితకు నాంది అమ్మ, గెలుపుకి పునాది అమ్మ
బోసి నవ్వులు చూసి మురిసేది
చిలిపి అలకలు చూసి చలించేది
జ్వరమొస్తే జ్వలించేది ..జగతిలో ఒకే దేవత అమ్మ ...
అమ్మంటే ఆదరణ
అమ్మంటే ఆయువు
అమ్మంటే ఆదిశక్తి రూపం
అమ్మంటే అనుబంధపు అల్లిక
అమ్మంటే ఉగ్గుపాల మురిపెం
అమ్మంటే, నా చేతి స్పర్శకి పొంగిపోయే నిండయిన చనుబాల చలువ
అమ్మంటే 9 నేలలు వెచ్చటి అమ్మ గర్భగుడిలో ప్రయాణం
అమ్మంటే నాన్నలో సగం మాత్రమే
కానీ అమ్మలో ప్రతి అనువు నా రూపం
అందుకే...
జన్మంతా నా యశోదమ్మ సేవలో... I Love You Amma