యవతీయువకుల మధ్య చిగురించే ప్రేమకు ఫస్ట్ ఇంప్రెషన్ అనేది చాలా ముఖ్యం. అందుకే అబ్బాయిలు.. అమ్మాయిల ముందు మొదటి ఇంప్రెషన్ కొట్టేయడానికి నానా తంటాలు పడుతారు. (ఇక్కడ ఫస్ట్ ఇంప్రెషన్ అంటే చూసిన మొదటి సారే మన మీద ఇంప్రెషన్ కలగాలనికాదు) అంతెందుకు ఇంగ్లీషులో.. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ అనే ఓ నానుడి ఉంది. ముఖ్యంగా నువ్వు మాట్లాడే విధానం, మాటలు, తనకి నచ్చినట్లు ఉండేలా చూసుకోవాలి.
కనీసం వారికి నచ్చినట్లు కాకపోయినా వారిని ఏ రకంగానూ హర్ట్ చేయకుండా ఉంటే చాలు. అరే!! మొదట్లోనే తన గురించి అన్నీ విషయాలు మాకెలా తెలుస్తాయి అంటారా?.. ఏముంది తనని కలిసినప్పుడు మీరు ఏదో ఒక టాపిక్ మొదలెట్టండి, అలా ప్రారంభించగానే తనకి అవి నచ్చితే మీతో తను కూడా మాటల జత కడుతుంది, లేదా తక్కువగా మాట్లాడుతుంది. ఇంకొకటి ఏది మాట్లాడిన పాజిటివ్‌గానే మాట్లాడండి.
ఎక్కడ కూడా నెగిటివ్ పదాలు రాకుండా జాగ్రత్త పడండి. మరొకటి ఏంటంటే సాధ్యమైనంతవరకు నిజాలు మాట్లాడేందుకు ప్రయత్నించండి లేదా ఇంప్రెషన్ మాట అటుంచితే మీపై నమ్మకమే పోతుంది. మనం చెప్పే మాటలు నోటి నుంచి కాకుండా మన మనసు నుంచి రావాలి! దాని భావాలు కళ్లతో చెప్పగలగాలి. ఉదాహరణకి మనం తను నవ్వేలా ఏదైనా చెప్పాం అనుకోండి.. అప్పుడు మీ పెదాలు నవ్వి ఆ నవ్వు కళ్లలో కనపడకపోతే ఎలా ఉంటుంది. కుదిరితే డ్రెస్సింగ్ స్టైల్ కూడా మరీ ఓవర్ లుక్‌లా కాకుండా సింపుల్‌గా చాలు.