(Not: the following is a political satire! Satire is a form of expression in literature or in any stand up comedy which I like the most. If admins or moderators think that, the below is hurting anyone’s political affiliations- you please feel free to delete. But before that - as I said - consider this as a satire- satire has no limitations- rest is up to you)
అనగనగా......ఒక వ్యవస్థ.......దాని....... పేరు?!!
నా వయస్సు షుమారుగా .....72 సంవత్సరాలు ....అంటే ....ఒక మనిషి గాని...వ్యవస్థ గాని ....తను పడిన కష్టానికి ....నడిచిన ప్రస్థానానికి .....స్వయంసమృద్ధిగా ఉండగలిగే ఒక మహత్తరమైన మైలురాయి.
మరి నేనేంటి...సూత్రం సరిగా కట్టని గాలి పటం లా క్రిందే గిరికీలుకొడుతున్నాను? నేను కాయ కష్టం చేసిన సొమ్మంతా ఏ దొంగలపరమైపోయింది? నా మది నిండా కుల మతాల మంటలేమిటి? నా దేహంనిండా గనుల శరాఘాతాలేమిటి? నా కడుపులో ఈ ఆకలి కేకలేమిటి ?ఇంకానా నుదుటి పై కాశ్మీరపు నెత్తుటి ధారలేమిటి? వేర్పాటు వాదాల విచ్చుకత్తులనెగళ్ళుఏమిటి?విలువల వలువల కీచక పర్వాలేమిటి?వారసత్వపు రాజ్యాధికారాల హంగామా లేమిటి? హిందూత్వమే జాతీయవాదమనే తప్పుడుప్రచారాలు ఏమిటి ?బజారున పడుతున్న భావితరం ఏమిటి?
ఓ .....క్షమించాలి.....నన్ను నేను పరిచయం చేస్కోలేదు కదూ!........నా పేరుభారతమాత!!....నాకింకో ముద్దు పేరు కూడాఉంది...అదేంటంటే.......అయ్యో? నా పేరు నాకే గుర్తురావడం లేదేంటి....అయ్యో ఇప్పుడెలా...అందరూ నన్నీ పేరుతోనే పిలుస్తారు ....నేనెలామర్చిపోయాను .......ఆగండాగండి ......నా పేరు కన్నుక్కొచ్చేస్తా.......
గౌరవనీయులైన ...నా రాష్ట్ర పతి గారూ......నా పేరేమిటి?
నువ్వెవరమ్మా ? ఇలా వచ్చావ్.....ఓ ..నీ ...పేరా? మొన్నటి వరకు బాగానేగుర్తుండేది....ఈ మధ్యనే ఆత్రుత ఎక్కువై ఏమీ గుర్తుండి చావడంలేదు, అమ్మా! ఏదో దళిత కోటాలొ అప్పనంగా దొరికిన ఈ పదవిలో షహారన్పూర్ గొడవల నుండీ, 15 శాతం మైనారిటీల రిజర్వేషన్ నోటి దూలనుండిఇప్పుడిప్పుడే బయటపడి, మనదేశం ఒక సర్వసత్తాక సామ్యవాద లౌకికగణతంత్ర రాజ్యం, ఏ మతాన్నీ, ఏ జాతినీ పెంచిపోషించ కూడదనిచెప్పినప్పటికీ, రాష్ట్రపతి కంటే ముందు నేను నా రాజకీయ పార్టీ కార్యకర్తనిఅనే మాట ని దృష్టిలో పెట్టుకుని గుడికట్టే పనిలో తలమునకలై ఉన్నా! నాకునీ పేర్లు అవేమీ తెలియదు తల్లీ! పోయి మన ప్రధాన మంత్రి గారిని అడుగు, ఆయనకేమైన తెలుసేమో!!
గౌరవనీయులైన నా ప్రధాన మంత్రి గారూ.....నా పేరేమిటి?
నమోవాకములు మాతా.....నమోవాకములు!.....నువ్వు సబలవు.....నువ్వేదుర్గా మాతవు.....త్రిశూలధారివైన కాళికవు.....సబర్మతి ఎక్స్ ప్రెస్ బూడిదసాక్షిగా .నరమేధ ధర్మేంద్ర గా చెబుతున్నా తల్లీ! కొంచెం రూటు మార్చిఇప్పుడిప్పుడే అభివృద్ధి మంత్రంజపించి హస్తినని ఈ సారి పూర్తి మెజారిటీతో హస్తినని హస్తగతం చేస్కున్నా! Demonetization బూచితో UP నిసాధించా! COVID జనాన్ని చంపేస్తున్నప్పటికీ లెక్కచెయ్యకుండాబెంగాలంతా తిరిగి తిరిగి అధికారం సాధించాలనుకుంటే చేజారిపోయింది. సర్వమానవాళి సుఖ సమృధి కోసం కుంభమేళా జరిపించా!జనాల ఆరోగ్యంకోసం వాక్సిన్ కంటే చీకట్లో కొవ్వొత్తులు వెలిగెస్తే మంచి జరుగుతుందని జనాన్నినమ్మించి ప్రదర్శనలు జరిపించా! నేనే ఎన్నని చెయ్యను తల్లీ! అసలుUnlawful Activities( Prevention) Act 1967, రూపు రేఖలు మార్చేసిఅసమ్మతి అనేదాన్నే లేకుండా అణగదొక్కేద్దాం అనుకుంటున్నా మాతా! మీరుఏమంటారు. అసలు 2 సీట్ల పార్టీని దేవుడి రధయాత్రల్లో 97 కి ఆ తర్వాతబెస్ట్ బేకరీ సమాధుల్తో పూర్తి మెజారిటీ కి తీస్కొచ్చా! ఇదంతా ప్రజల కోసమేకదా మాతా! అసలు ఈ పిచ్చి జనం నేనెంత కష్టపడినా అర్ధం చేస్కొరెందుకో!అమ్మా క్షమించాలి! మీ పేరు మర్చిపోయాను నాకు "మన్ కి బాత్" తో ఉప్పరసోది కి టైం అయింది. అసలీ జనానికి "హిందూత్వాన్నే" తిమ్మిని బమ్మి చేసి" హిందూ జాతీయ వాదం" గా చేసేస్తే అర్ధం చేస్కుని చావరేంటో!
గౌరవనీయులైన సోనియా గారు .....నా పేరేంటో మీ రైనా చెబుతారాఅమ్మా......
ఓ......మీరా ఏంటి...ఇలా వొచ్చారు?....ఓ... మీ.... పేరా? ఇప్పటి వరకు ఈదేశం లో ఇన్నాళ్ళు ఉండగలిగానంటే..అది మీ నామ బలం వల్లనే! భలే ఫన్నీగా ఉంటుంది మీ పేరు...నేను మొదటి సారి విన్నప్పుడు ...ఇంతచక్కనైనపేరుపెట్టుకున్న మీ జనం, నాకు వొంగి వొంగి దణ్ణాలు ఎందుకు పెట్టేస్తున్నారోఅర్ధం కాలేదు. తర్వాతి కాలం లో నన్ను నేను రక్షించు కోడానికి మీ నామజపం చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. నాకు జరిగిన ఇన్ని అవమానాల్నిసహిస్తున్నదీ, భరిస్తున్నదీ, నాటక మాడుతున్నదీ....నాకు కాకుండా పోయినఆ ప్రధానమంత్రి పదివిని కనీసం యువరాజా వారికైనా కట్టబెట్టాలని. కానీతర్వాత్తర్వాత జనమంతా భట్రాజులై పోయిన క్రమం లో మీ పేరు మళ్ళావాడాల్సిన అవసరం నాకు కలగలేదు. అందుకే మర్చి పోయాను . క్షమించాలి!.....మా యువరాజా వారిని పిలుస్తాను ఆగండి.
గౌరవనీయులైన యువరాజా వారు......నా పేరేమిటి?
హీ......హీ.....హీ....నాకప్పుడే పెళ్ళేమిటి?..పెళ్లి టైం వొచ్చినప్పుడుచెబుతా....ఓ... సారీ ......మీ పేరా? ఏమో అండి.... ఇప్పుడు నేనంతాదేశాటన చేసి రాజ్యం లో భక్తుల శ్రేణి ని పటిష్టం చేసే పనిలో ఉన్నాను. కత్తిసాములు, సాము గరిడీలు, టక్కుటమార విద్యలు నేర్చుకుని ..విపక్షాలఅభ్యర్ధి తో వక్తృత్వ పోటీలో గెలిచేసే....గేలిచేసే....పనిలో సకలగ్రంధాల్నితిరగేస్తూ ఇంకొంచెం బిజీ గా ఉన్నాను, ఏ ప్రశ్న అడిగినా "ఆవుమీద వ్యాసం" లా అన్నిటికి సరిపొయేలా ఎలా చెప్పడం అనేదాని మీదకసరత్తు చేస్తున్నా!....మీరు వీలైతే ధర్మేంద్ర గారిని కలిసిప్రయత్నించండి...పొరపాటున ఆయనకీ ప్రశ్నకి సమాధానం తెలిసేస్తే నేనుకూడా అర్జంటు గా తెలుసుకోవాలి, పరీక్ష పాసవ్వాలి కదండీ....హి.....హి....హీ
నాకు తిరిగి తరిగి అలసట వోచ్చేస్తోంది .....ఎండలు మండిపోతున్నాయ్....ఏమవుతోంది నాకు ? నా అవయవాలు నాకు సహకరించడం లేదేంటి?జవసత్వాలుడిగి పోతున్నాయ్.... మదిలో నిరాశా జ్వాలలు ఎగసిపడుతున్నాయ్....అయినా తప్పదు ...నాపేరేంటో.....తెలుసుకోవాల్సిందే.....ఆఖరి ప్రయత్నం గా భాగ్యనగరానికివెళ్తే?..
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారూ......నాపేరేమిటి?
ఓ మీ పేరా! హి హి హి ! నాకు తెలీదండి. కావాలంటే మళ్ళా ఓదార్పు యాత్రచేసి కనుక్కుంటా! మా నాన్న నాకోసం ఎంత దోచాడు! అయ్యొ అయ్యొఅదేంటి అలా అనేసాను! మా నాన్న ప్రజలకోసం ఎంత చేసాడు అనబోయిఅలా అనేసా! హి హి హి!ఎన్ని క్విడ్ కోప్రో లు జరిగినా ఈ వెర్రి జనాలఅండదండలతో అధికారం హస్తగతం చేస్కున్నా! రకరకాల పధకాలతోజనాలు ఏం పని చెయ్యకపోయినా ఇంటికి డబ్బులు పంపే వెసులుబాటుచేసేసా! అయినా ఎవడబ్బ సొమ్మమ్మా నా సొమ్మా ఏంటి! జనాన్ని ఇలాసొమరిపేతులు చెయ్యకపోతే మళ్ళా ఎదురుతిరిగి ప్రశ్నిస్తే మళ్ళా నాకే బొక్కకదమ్మా! లంచాల అరాచకాలన్నీ బయటికి తీస్తారు! ఈ వెర్రి జనం మేల్కునేలోపు ఆంధ్ర ప్రదేశ్ ని రియల్ ఎస్టేట్ ప్లాట్లు క్రింద చేసి అమ్మేస్తా ! హి హి హి! మీ పేరా అమ్మా ! నాకు అస్సలు తెలీదమ్మా! పోని ఇంద్రబాబు కి ఏమన్నాతెల్సేమొ వెళ్ళి కనుక్కోండమ్మా!
గౌరవనీయులైన నారా ఇంద్రబాబునాయుడు గారు.....నా పేరేమిటి?
చూడమ్మా! రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థుతుల్లో ఉంది...దున్నపోతు కిమేతేసి..పాలు పితుక్కోవాలనుకుంటే అవివేకమమ్మా....సిగ్గుశరంఉండాలమ్మా...అసలే పార్టీ జెండా మోసీ మోసీఅలిసిపోయామమ్మా....ఉన్న ఆస్తుల్నిఅమ్మైనాసరే ....మనం పార్టీ నికాపాడుకుని, అధికారం లోకి వొచ్చేయ్యాలమ్మా....అసలేతొమ్మిదేళ్ళుఅయిందమ్మా...చాలా ఆకలితోఉన్నామమ్మా....అందుకో “చస్తున్నా మీకోసం” అమ్మా......చి చి..... చీ....”వస్తునా మీకోసం” అమ్మా. మనబ్బాయి లోకేష్ కూడా మీ పేరు కనుక్కోడానికిట్వీట్లు మీద ట్వీట్లు వేస్తున్నాడమ్మా.....కనుక్కోగానే ...మీకు చెబుతానమ్మా...ఈమధ్య లో మీకు ఓపిక ఉంటే అవినీతి చెట్టున్న జయమ్మ వాకిట్లో కివెళ్ళండమ్మా.....జై తెలుగునాడు.....జై జై తెలుగునాడు....జైహింద్.
ఏమైపోయింది ఈ జనానికి ...ఒక్కరంటే ఒక్కరికి నా పేరు తెలీదా ? లేక తెలిసీతెలియనట్లు నటిస్తూ, లేదా తెలుసుకున్నా ఉపయోగం లేదన్నట్లుఆలోచిస్తున్నారా? ఎవరి జీవన సమరం లో వాళ్ళు పడిపోయి ఏ పేరైతే ఏంలే ? ఎవరైతే ఏం లే ? అని మిన్నకుంటున్నారా? లేదా దోచుకున్న వాటిలోవాటాలు పంచేసుకుంటూఎవడు దోచుకోడం లేదులే ..అనేసి సమాధానపడిపోతున్నారా? నాలో ఓపిక నశించింది.....ఆకలికేకలేస్తోంది.....దాహమేస్తోంది......చచ్చిపోతానేమో.....నా పేరుతెల్సుకోకుండానే చచ్చిపోతానా?!
ఏంటవ్వా?.....ఈ ఎండలో ఇక్కడేం చేస్తున్నావ్ ? బుద్దుడునిచూస్తున్నావా? బుద్దుడు ఎక్కడికీ పారిపోడు లే అవ్వా? ఈ ఎండలో ఉంటేనువ్వే పైకి పోతావ్...ఏమైనా తిన్నావా లేదా? ఇక్కడే ఉంటే ఉత్తి పుణ్యానికిసచ్చి పోతావ్ వడదెబ్బకి....లే లే ఇంటికి పో!
పోరడా...నువ్వీ టైం లో బడికి పోకుండా ఇక్కడేం చేస్తున్నావ్?
హహ్హహా.......ఇస్కూల్ గెప్పుడో బంద్ జేసిన! మా అయ్యకి పని పోయింది . అందుకే టీ లు అమ్ముతున్నా...సదూకోడాన్కి పైసల్లేవ్..గందుకే ఆరో క్లాస్ కిబంద్ పెట్టేసినా....లే పదా మా గుడిసెకి పోదాం...ఇక్కడే గుంటేసచ్చిపోతావ్....
నా పేరు ....భారతమాత ......నాకింకో పేరుండాలి....అది తెల్సుకోడానికేతిరుగుతున్నా......నా పేరందరూ మర్చిపోయారు.
అవ్వ్....నీకో పేరుండాలే....నేను మా సోషల్ బుక్ ల సదివిన ..... జర....యాద్కి..రాడంలే....సరే పోదాం పా...
పిల్లోడు ...చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు.....నేను నడవలేకపోతున్నా......వొళ్ళు తూలిపోతోంది......కళ్ళు తిరిగి పోతున్నాయ్.....వాడిచేతిలోంచి జారి నది రోడ్డు మీద పడిపోబోతున్నా. నేనుచచ్చిపోతున్నానా....గాల్లో లీల గా వాడి మాటలు వినబడుతున్నాయ్ .....ఓఅవ్వా ....యాద్కోచ్చింది...నీ పేరు .......నీ పేరు ......
“ప్ర ...........జా..........స్వా..........మ్యo”
----------------------------------------------------------------
నేను చిన్నప్పుడు చదివిన "ఇల్లలికిన ఈగ" కథ ఆధారంగా
-----------------------------------------------------------------
అందరికీ గ(ర)ణ తంత్ర శుభాకాంక్షలు !!!
నిగ్గదీసి అడుగు, ఈ సిగ్గు లేని జనాన్ని
అగ్గి తోటి కడుగు, ఈ సమాజ జీవక్షవాన్ని
మారదు లోకం, మారదు కాలం
- సిరివెన్నెల
-EkaLustYa
25JAN2022 4:42 PM EST