ఒంటరిగా ప్రయాణం సాగుతోంది....!
చల్ల గాలి....అర్థం లేని జ్ఞాపకాలు కొన్ని
నన్ను వెంటాడుతున్నాయి, మాటలు రావట్లేదు, ఎదలో ఒక బరువు, మోయాలి అనిపిస్తుంది,
వేగం ఎక్కువైంది, దగ్గర అవ్వడానికా...?
ఎందుకు, దేనికి ఈ ఆరాటం,
మరి దూరం అవ్వడానికా...?
నేను ఎందుకు మేలుకొన్నాను, నిద్ర రాదా...