అమ్మ ఉంటె చాలు జన్మంతా మేలు..
అమ్మ ఉంటె చాలు అనురాగపు సంకెళ్లు...
కష్టాలకు చిట్కాలు, కన్నీళ్లకు వీడ్కోలు ..
ఆప్యాయత గుళికలు, నును వెచ్చని కవ్వింతలు..
ఓర్పుకు పుట్టిల్లు, ఓదార్పుకు పొదరిల్లు...
అమ్మ ప్రేమగా ఈ సృష్టి మొదలు,అమ్మ తోనే ఈ జగతి కదులు ..
అమ్మ ఉంటె చాలు జన్మంతా మేలు
భవితకు నాంది అమ్మ...