ఉప్పొంగి పోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి "2"
కొండల్లో ఉరికింది గోదావరి,
తాను కోనల్లో నిండింది గోదావరి..
కొండల్లో ఉరికింది, కోనల్లో నిండింది,
ఆకాశ గంగ తో హస్తాలు కలిపింది. "ఉప్పొంగి"
నుడులలో,సుడులలో, పరువాల నడలలో,
పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి వచ్చింది.
అడవి చెట్లన్నీనీ,జడ లోన తురిమింది
ఊర్లు దండలు గుచ్చి మెడలోన దాల్చింది.."ఉప్పొంగి"..


